Abn logo
Feb 27 2021 @ 00:43AM

ఎంపీ రఘురామ సంజాయిషీ ఇవ్వాలి : మంత్రి

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి):కుల మతాలను విడదీస్తూ ప్రజల మనోభా వాలను దెబ్బ తీసేలా వ్యవహరించిన ఎంపీ రఘురామకృష్ణం రాజు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సంజాయిషీ ఇవ్వాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడాది కాలంగా  ఎంపీ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదని, ప్రసార మాధ్యమంలో విమర్శలు చేయడం పరిపాటిగా చేసుకున్నారని ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఎంపీ తన స్థాయిని దిగజార్చుకోవద్దని  మంత్రి హితవు పలికారు.


Advertisement
Advertisement
Advertisement