ఢిల్లీ: ఏపీ డీజీపీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. విచారణ పేరుతో తనపై పోలీసులు దాడి చేసిన ఘటనపై త్వరితగతిన దర్యాఫ్తు జరపాలని కోరారు. తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు పాల్పడ్డారని, దాడిచేసిన ఐదుగురిలో సీబీసీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ కూడా ఉన్నారని తెలిపారు. దాడిపై లోక్‌సభ స్పీకర్ అప్పటి డీజీపీ సవాంగ్‌ను నివేదిక కోరినా.. ఇంతవరకు స్పందించలేదని లేఖలో పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్‌కు త్వరగా నివేదిక పంపాలన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మళ్లీ విశ్వాసం కలిగించేలా.. నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి