Abn logo
Sep 27 2021 @ 15:20PM

థియేటర్లలో బాత్‌రూమ్‌లు క్లీన్ చేయడానికి వాలంటీర్లను అడిగితే ఇస్తారా?: MP Raghu Rama సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్‌‌లైన్‌లో విక్రయించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ రఘురామ కృష్ణరాజు తప్పుబట్టారు. ఢిల్లీలోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘సినిమా వ్యాపారం అనేది చాలా చిన్న వ్యాపారం. అలాంటి దానిపై ప్రభుత్వం అంత శ్రద్ధ చూపించడం అవసరమా? రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్లు అధ్వానంగా మారినా పట్టించుకోవడం లేదు. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ వాళ్లే అడిగినా కూడా ప్రభుత్వానికి అవసరమా? వాళ్లు ఎన్నైనా అడుగుతారు. సినిమా హాళ్ల బాత్‌రూమ్‌లు క్లీన్ చేయడానికి మీరు వాలంటీర్లను కేటాయించండి అని కూడా అడుగుతారు. వాళ్లకు ఇచ్చే రూ. 5వేలు మేమే ఇస్తాం. అంత తక్కువకు మాకు ఎవరూ రావడం లేదు. మీరు వాలంటీర్ల పేర్లతో మాకు కేటాయించండి అని అడిగితే ఇస్తారా? అడగడానికి వాళ్లెవరు?.. ఓకే చెప్పడానికి వీళ్లెవరు? ఇది చాలా తప్పు. పవన్ కల్యాణ్ చెప్పిన విషయాన్ని నేను సమర్థిస్తా. పవన్ కల్యాణ్ చాలా క్లియర్‌గా చెప్పారు. తన మీద కోపాన్ని ఇండస్ట్రీపై చూపిస్తున్నారనే ఆవేదన ఆయన మాటల్లో కనిపించింది.’’ అని రఘురామ కృష్ణరాజు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...