గ్రామ సచివాలయాలు పెద్ద కుంభకోణం: ఎంపీ రఘురామకృష్ణరాజు

ABN , First Publish Date - 2022-01-25T20:35:12+05:30 IST

ఏపీలోని గ్రామ సచివాలయాలు పెద్ద కుంభకోణమని ఎంపీ

గ్రామ సచివాలయాలు పెద్ద కుంభకోణం: ఎంపీ రఘురామకృష్ణరాజు

 ఢిల్లీ: ఏపీలోని గ్రామ సచివాలయాలు పెద్ద కుంభకోణమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.  మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజలు జగన్‌రెడ్డి పరిపాలిస్తారని ఓట్లు వేస్తే పత్రికల్లో పనిచేసేవారిని తీసుకొచ్చి పాలన సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు హైకోర్టులో కేసు వేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేని ఉద్యోగసంఘాల నేతలను కోర్టుకు పిలవడమేంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో జడ్జిల జీతాలు ఒక్క రూపాయి చేస్తానంటే తీర్పు ఇస్తే న్యాయమూర్తులు ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. పంచాయతీల నిధులను గ్రామ సచివాలయాలకు వాడుతున్నారని ఆయన ఆరోపించారు.


ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించడం తప్పని ఆయన పేర్కొన్నారు. నాటకాలను నిషేధించి వాటిపై ఆధారపడ్డ కళాకారుల పొట్ట కొట్టవద్దని ఆయన హితవు పలికారు. జీవో వెనక్కి తీసుకోకపోతే కళాకారుల తరపున కోర్టులో పిల్ వేస్తానని రఘురామ తెలిపారు. 

Updated Date - 2022-01-25T20:35:12+05:30 IST