APలో తయారయ్యే మద్యంలో హానికరమైన రసాయనాలు: MP Raghurama

ABN , First Publish Date - 2022-06-29T20:36:22+05:30 IST

మద్యం శాంపిల్స్‌లో ఏముంది అనేది మాత్రమే సాక్షి పేపర్‌లో రాశారని, అసలు మద్యంలో ఏం కలుస్తుందో...

APలో తయారయ్యే మద్యంలో హానికరమైన రసాయనాలు: MP Raghurama

ఢిల్లీ (Delhi): మద్యం శాంపిల్స్‌ (Alcohol samples‌)లో ఏముంది అనేది మాత్రమే సాక్షి పేపర్‌లో రాశారని, అసలు మద్యంలో ఏం కలుస్తుందో దాని వలన ఏమవుతుందో రాయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తయారయ్యే మద్యంలో హానికరమైన రసాయనాలు ఉన్నాయన్నారు. మద్యం ఎవరు తయారు చేస్తున్నారో చెప్పమంటే చెప్పరని, చంద్రబాబు నాయుడు లైసెన్స్ ఇచ్చారని అంటున్నారని.. ఏపీలో ఉన్న బ్రాండ్స్ ఇతర రాష్టాలలో ఎక్కడ లేవని ఆయన అన్నారు. పాత బ్రాండ్స్ ఇప్పుడు ఒక్కటి కూడా దొరకడం లేదని, కొత్త కొత్త బ్రాండ్స్ మార్కెట్‌లోకి వస్తున్నాయన్నారు. జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెనలాగా ఇప్పుడు మద్యం నిషేధం పధకానికి జగనన్న వితంతు దీవెన అని పేరు పెట్టాల్సి ఉంటుందన్నారు. 


మద్యాన్ని ఇంతకు ముందు బేవరైజేస్  కార్పొరేషన్ తయారు చేసేదని రాఘురామ అన్నారు. 20 మద్యం కంపెనీల నుంచి బ్రాండ్స్ కొంటున్నామని అధికారులు అంటున్నారు. దొంగ స్కీమ్స్ పెట్టి దొంగ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను పిచ్చోళ్ళుగా తాయారు చేసే పధకమే వారి పేపర్‌లో రాశారన్నారు. సాక్షిలో అబద్దాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మద్యానికి క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారు?... కార్డ్స్ ఎందుకు తీసుకోవడం లేదు?.. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాత బ్రాండ్స్ ఎందుకు దొరకడం లేదు? దీనికి సమాధానం చెప్పాలని వాసు దేవరెడ్డికి రఘురామ సవాల్ చేశారు. 


తనను సంసద్ టీవీ ఇంటర్వ్యూకు పిలవద్దని సాయిరెడ్డి లేఖ రాశారని రఘురామ అన్నారు. సంసద్ టీవీకి, పార్టీలకు సంబంధం ఉండదన్నారు. సంసద్ టీవీలో తన అభిప్రాయాన్ని మాత్రమే చెబుతానని, వేరేవారి గురించి తాను చెప్పనన్నారు. ఈ మేరకు సంసద్ టీవీ సీఈవోకి లేఖ రాసినట్లు చెప్పారు. తనను పార్టీ నుంచి బహిష్కరించకుండా చర్చల్లో అనుమతించొద్దంటూ లేఖలు రాయలేరని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. సాయిరెడ్డి లేఖ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందన్నారు. ఏబీ వెంకటేశ్వరరావుకు ఒక రూల్.. జగన్‌కు ఇంకొక రూలా? అని ప్రశ్నించారు. ప్రిటింగ్ అండ్ స్టేషనరీ ఉద్యోగంలో ఉండి సాక్షులను ఏబీవీ ప్రభావితం చేస్తే.. 32 కేసులు ఉండి సీఎం హోదాలో ఉన్నవారు ఇంకా ఎంతమందిని ప్రభావితం చేయొచ్చునని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కోర్టుకు అట్టెండ్ అయితే బాగుంటుందని రఘురామ కృష్ణంరాజు సూచించారు. 

Updated Date - 2022-06-29T20:36:22+05:30 IST