AP News: ఏదో కుట్ర ఉంది, సీఎం కుటుంబంలో ఇలా జరగటం బాధాకరం: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2022-08-12T21:39:40+05:30 IST

ఎంపీ రఘురామ సతీసమేతంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.

AP News: ఏదో కుట్ర ఉంది, సీఎం కుటుంబంలో ఇలా జరగటం బాధాకరం: ఎంపీ రఘురామ

ఢిల్లీ (Delhi): నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) సతీసమేతంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu)ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ అంశాన్ని రాష్ట్రపతికి వివరించినట్లు చెప్పారు. మాతృభాష ఉండేలా చూడాలని చెప్పినందుకు తనపై అనర్హత వేటు వేయాలని చూశారని, ప్రభుత్వం తనను తీసుకెళ్లి కొట్టిన అంశాన్ని వివరించానన్నారు. అలాగే ఏపీ (AP) రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను, ఆర్ధిక సంక్షోభం ఇతర అంశాలను రాష్ట్రపతికి వివరించానన్నారు. వైఎస్ విజయమ్మ ప్రమాదం నుంచి క్షేమంగా బయట పడినట్టు తెలిసిందన్నారు. విజయమ్మతో మాట్లాడే ప్రయత్నం చేశానన్నారు. కేవలం 3500 కిలోమీటర్లు మాత్రమే కారు తిరిగిందని, ట్యూబ్ లెస్ టైర్స్ ఒకేసారి రెండు టైర్లు బద్దలయ్యాయని, ఇలాంటి ఘటన అసంభవమన్నారు. ఇది నమ్మశక్యంగా లేదని, దీనిపై సీఎం జగన్ తగు విచారణ జరిపించాలన్నారు. సీఎం దుష్ట చతుష్టయం అని అంటారు కాబట్టి విచారణ జరిపించాలన్నారు. ఏదో కుట్ర ఉందని, సీఎం కుటుంబంలో ఇలా జరగటం బాధాకరమన్నారు. గతంలో బాబాయ్‌ని కోల్పోయారని రఘురామ అన్నారు.


విద్యుత్ వాత

ప్రజలపై ట్రూ అప్ ఛార్జీలు వేసేందుకు సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారని రఘురామ అన్నారు. రూ.3 వేల కోట్లకు బాదుడే బాదుడుకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఆనాడు విద్యుత్ బిల్లులు పెంచమని, చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని అన్నారని, ఇప్పుడు సీఎం విద్యుత్ చార్జీలు పెంచుకుంటు పోతున్నారని, చేతకాని తనంతో విద్యుత్ కాంట్రాక్టులు క్యాన్సల్ చేశారని విమర్శించారు. భారతదేశం పుట్టిన తర్వాత ఇలాంటి విద్యుత్ ట్రూ అప్ చార్జీలు ఎక్కడ లేవన్నారు. ఏపీలో ఆస్తుల విలువ సగానికి సగం పడిపోయిందన్నారు. హైదరాబాద్ ఆస్తుల విలువ 10 రేట్లు పెరిగిందన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  ఉచితలు వద్దన్నారని వార్తలు వచ్చాయని, సంక్షేమం ఉండాలి కానీ సంక్షోభంలోకి రాష్టాన్ని నెట్టకూడదన్నారు. మహిళ కమిషన్ కూడా ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంపై స్పందించిందని, ఎంపీ జస్బిర్ సింగ్ గిల్ ప్రధానమంత్రికి లేఖ రాశారన్నారు. ప్రైవేట్ ల్యాబ్స్ ఉన్నాయి.. ఆ వీడియో ఇవ్వొచ్చునని సూచించారు. సూపర్ మ్యాన్, బాడ్ మ్యాన్ సినిమాలు ఉన్నాయి...ఇప్పుడు న్యూడ్ మ్యాన్ సినిమాలు అంటున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Updated Date - 2022-08-12T21:39:40+05:30 IST