ఎంపీపై భౌతిక దాడి సహించరాని చర్య

ABN , First Publish Date - 2021-05-17T15:44:42+05:30 IST

పార్లమెంట్‌ సభ్యుడు రఘురామకృష్ణంరాజును..

ఎంపీపై భౌతిక దాడి సహించరాని చర్య

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు


విజయవాడ సిటీ, మే 16: పార్లమెంట్‌ సభ్యుడు రఘురామకృష్ణంరాజును అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా సీఐడీ పోలీసుల కస్టడీలో ఉండగా దారుణంగా భౌతికదాడి చేయడం సహించరానిదని, దీనికి బాధ్యులను వెంటనే సస్పెండ్‌ చేయాలని రాష్ట్ర డీజీపీని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అత్యంత ఉన్నత స్థాయినేత గానీ, పోలీస్‌ ఉన్నతాధికారి ఆదేశాలు లేకుండా ఇది జరగదన్నారు. కరోనాతో రాష్ట్రం అల్లాడుతుంటే కొవిడ్‌ కట్టడి చర్యలు తీసుకోకుండా తనను విమర్శిస్తున్నారనే కారణం తో అచ్చెన్నాయుడు, ధూళిపాళ్లనరేంద్ర, చంద్రబాబు, రఘురామకృష్ణంరాజు, టీవి-5, ఏబీఎన్‌ చానళ్లపైనా తప్పుడుకేసులతో పైశాచిక అనందం పొందుతుండటం రోమ్‌ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించిన చందంగా ఉందన్నారు. ఇప్పటికైనా సీఎం ఇటువంటి పిచ్చిచర్యలు మాని ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు.

Updated Date - 2021-05-17T15:44:42+05:30 IST