ఏపీ చీఫ్‌ సెక్రటరీ తీరుపై న్యాయవాదుల విస్మయం

ABN , First Publish Date - 2021-05-17T23:27:22+05:30 IST

ఏపీ చీఫ్‌ సెక్రటరీ తీరుపై న్యాయవాదుల విస్మయం వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి

ఏపీ చీఫ్‌ సెక్రటరీ తీరుపై న్యాయవాదుల విస్మయం

అమరావతి: ఏపీ చీఫ్‌ సెక్రటరీ తీరుపై న్యాయవాదుల విస్మయం వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి పంపే బాధ్యతను ఏపీ సీఎస్‌పై సుప్రీం కోర్టు పెట్టిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు చెప్పినా.. సీఎస్ స్పందించడం లేదని రఘురామ లాయర్లు అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను వాట్సాప్‌లో పంపినా.. సీఎస్‌ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని న్యాయవాదులు మండిపడ్డారు. 


మరోవైపు, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌తో రఘురామ లాయర్లు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాము జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ను నియమించామని రఘురామ లాయర్లకు కోర్టు అధికారులు చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇస్తామన్నారని రఘురామ న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు. అయితే ఏపీ సీఎస్‌తో కూడా మాట్లాడానని, ఇవాళ రాత్రిలోపు తరలిస్తామని సీఎస్‌ చెప్పారన్నారు. రఘురామ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా త్వరగా తరలించాలని కోరామని, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని సీఎస్‌ చెప్పారని లక్ష్మీ నారాయణ అన్నారు.

Updated Date - 2021-05-17T23:27:22+05:30 IST