Abn logo
May 15 2021 @ 18:23PM

రఘురామ కేసు విచారణకు స్పెషల్ డివిజన్ బెంచ్

గుంటూరు: ఎంపీ రఘురామ కేసు విచారణకు స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటు చేశారు. జస్టిస్ ప్రవీణ్ నేతృత్వంలో బెంచ్ ఏర్పాటైంది. స్పెషల్ మోషన్‌ను సీనియర్ న్యాయవాదులు మూవ్ చేశారు. ప్రత్యేక బెంచ్ ఏర్పాటుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి త్వరలోనే విచారణ మొదలయ్యే అవకాశం ఉంది.


ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హైడ్రామా చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సీఐడీ పోలీసులపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను సీఐడీ పోలీసులు కొట్టారని న్యాయవాదులకు ఎంపీ తెలిపారు. ఈ మేరకు జడ్జికి లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు.  ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిప్పిపంపారు. మరోవైపు లాయర్ ఆదినారాయణరావు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో డివిజన్ బెంచ్‌లో విచారణ జరగనుంది. 

Advertisement