రామప్పదేవాలయం తెలంగాణ ప్రజలకు గర్వకారణం

ABN , First Publish Date - 2021-07-27T00:10:17+05:30 IST

చారిత్రక రామప్ప దేవాలయం వారసత్వ కట్టడంగా యునేస్కో గుర్తింపు రావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామానాగేశ్వరరావు అన్నారు.

రామప్పదేవాలయం తెలంగాణ ప్రజలకు గర్వకారణం

హైదరాబాద్: చారిత్రక రామప్ప దేవాలయం వారసత్వ కట్టడంగా యునేస్కో గుర్తింపు రావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామానాగేశ్వరరావు అన్నారు. ఈమేరకు ఆయన పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేజరిగిందని,కాకతీయుల గొలుసు కట్టు చెరువులను బయటకు తెచ్చామని, రామప్ప ఆలయానికి యూనెస్కో గుర్తింపు లభించడం సంతోషకరమైన విషయమన్నారు.


800 ఏళ్ల క్రితంనాటి కట్టడం ప్రపంచానికి తెలియ చెప్పాము.ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధుల కృషితో రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కింది. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు.తెలంగాణ సంస్కృతిని, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ చరిత్రను ముందుకు తీసుకువచ్చారని అన్నారు.అలాగే యాదాద్రి ఆలయం ఈ కాలంలోనే అద్భుతమైన కట్టడమని పేర్కొన్నారు.రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశిత్వం కింద రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా అనేక అడ్డంకులు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం 4, 5 ఏళ్ల నుంచి పర్యవేక్షణ చేయడం ద్వారా ఇది సాధ్యం అయ్యిందని చెప్పారు.


ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు తెలంగాణలో చారిత్రక సంపద గుర్తించింది కేవలం 8 మాత్రమేనని  ఇంకా ఎన్నో కట్టడాలకు గుర్తింపు రావాల్సి ఉందన్నారు. గతంలో తెలంగాణలో చరిత్రాత్మక కట్టడాలపై వివక్ష కొనసాగింది. నాగార్జునసాగర్ లో బుద్ధవనంను కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నారు.అంతర్జాతీయ పర్యాటకులు కూడా వస్తే మేడారం, లక్నవరంతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు, ఎంపీ మాలోత్ కవిత, ఎంపీ పసునూరి దయాకర్,బడుగుల లింగయ్య యాదవ్,రాములు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T00:10:17+05:30 IST