ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న మోపిదేవి
ద్వారకాతిరుమల, మే 21: చిన్నతిరుమలేశుని ఆలయాన్ని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ శనివారం సందర్శించారు. కుటుంబసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలికారు. ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించి స్వామి, అమ్మవార్లను దర్శించి మోపిదేవి పూజలు చేశారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు శ్రీవారి శేషవస్త్రాలను కప్పి వేద ఆశీర్వచనం పలికారు. ఎంపీకి నివృతరావు శ్రీవారి మెమెంటో, ప్రసాదాలను అందజేశారు.