స్ర్కిప్ట్‌ రాసేది ఎవరో..చదివేది మాత్రం ఎంపీ భరత

ABN , First Publish Date - 2020-10-27T06:22:51+05:30 IST

ఇసుక వ్యవహారంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్న చీడ పురుగులను ఊరుకునేది లేదని ఎంపీ భరత చేసిన వ్యాఖ్యలు బహుశా స్ర్కిప్ట్‌ కావచ్చునని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావడంతో స్ర్కిప్ట్‌ ఎవరో అందిస్తున్నట్లు ఉందన్నారు.

స్ర్కిప్ట్‌ రాసేది ఎవరో..చదివేది మాత్రం ఎంపీ భరత

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
రాజమహేంద్రవరం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఇసుక వ్యవహారంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్న చీడ పురుగులను ఊరుకునేది లేదని ఎంపీ భరత చేసిన వ్యాఖ్యలు బహుశా స్ర్కిప్ట్‌ కావచ్చునని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావడంతో స్ర్కిప్ట్‌ ఎవరో అందిస్తున్నట్లు ఉందన్నారు.  రాజమహేంద్రవరంలోని తాడితోటలో తన ఆఫీసులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీతానగరం మండలంలోని సింగవరం, వంగలపూడి మధ్య ఇసుక ర్యాంపులలో కాంట్రాక్టర్లు సరిహద్దులు దాటి తవ్వడంతో అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారన్నారు. అయితే ఈ వ్యవహారంలో  ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే చీడపురుగులను ఊరుకునేది లేదని ఎంపీ భరత్‌ అన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు.  ‘‘ఇటీవల పోలీసు సంస్మరణ దినోత్సవం రోజున ఇద్దరం ఒకే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుకున్నాం. కానీ మర్నాడు పేపర్లలో ఆయన మాట్లాడినట్టు కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. బహుశా ఇది స్ర్కిప్ట్‌ కావచ్చని అనుకుంటున్నాను’’ అని అన్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని, ఎన్నికల్లో విభేదాల వల్లే ఓడిపోతే అధిష్ఠానమే చర్య తీసుకుంటుందని రాజా అన్నారు.  కొవ్వూరు ఇసుక విషయంలో తాను అన్నట్టు వచ్చిన మాటలు కూడా వాస్తవం కాదన్నారు. డబ్బులు తీసుకోకుండా రాజకీయాలు చేస్తున్నామనడం లేదని, అవి ఫంక్షన్లు, మీటింగ్‌ల కోసమని, ఆస్తులు సంపాదించుకోవడానికి ఇసుక ర్యాంపుల్లో అవినీతి చేయడంలేదన్నారు. నిజాయతీగానే రాజకీయం చేస్తానని లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ దసరా బుల్లోడిలా దసరా ముందు సీతానగరం రోడ్డుకోసం ఆందోళన చేశారని, ఆ రోడ్డు నిజంగా అధ్వానంగా ఉందని,  కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టించుకోలేదని అన్నారు. తాను రూ.70 కోట్లు మంజూరు చేయించానని, త్వరలోనే టెండర్లు పిలవనున్నామని తెలిపారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్లలో 59 మందికి స్థానం ఇవ్వగా, అందులో 18మంది రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, రాజానగరం నియోజకవర్గాల్లోని వారేనన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో గ్రామాల విలీనం ఖాయమని, కానీ ఎన్ని విలీనం అవుతాయో చూడాలన్నారు. గాండ్ల తెలకుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన సంకిన భవానీ ప్రియ, పార్టీ నేతలు నందెపు శ్రీను, మార్తలక్ష్మి, ప్రసాదుల హరనాథ్‌, శ్రీశైన కార్పొరేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మావతి, బొంతు శ్రీహరి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T06:22:51+05:30 IST