MP: ఉరితాడుకు వేలాడుతూ కనిపించిన మంత్రి కోడలు

ABN , First Publish Date - 2022-05-11T17:54:15+05:30 IST

Madhya Pradesh రాష్ట్ర School education minister Inder Singh Parmar కోడలు (22) ఒక ఇంట్లో ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. షాజపూర్‌లోని మంత్రి పూర్వీకుల ఇంట్లో బుధవారం ఉదయం వెలుగు చూసింది ఈ ఘటన.

MP: ఉరితాడుకు వేలాడుతూ కనిపించిన మంత్రి కోడలు

భోపాల్: Madhya Pradesh రాష్ట్ర School education minister Inder Singh Parmar కోడలు (22) ఒక ఇంట్లో ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. షాజపూర్‌లోని మంత్రి పూర్వీకుల ఇంట్లో బుధవారం ఉదయం వెలుగు చూసింది ఈ ఘటన. మృతురాలి పేరు Savita Parmar అని స్థానిక పోలీసులు వెళ్లడించారు. మంత్రి కుమారుడు Devraj Singh Parmar తో ఆమెకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని షాజపూర్ పోలీసులు తెలిపారు. కాగా, కుటుంబ సమస్యల కారణంగా ఆమె బుధవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త దేవరాజ్ సింగ్ సహా ఇతర బంధువులు.. మహ్మద్ ఖేరా అనే గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో ఉన్నారట.

Read more