shocking: విద్యుత్ నియోగదారుడికి బిగ్ షాక్

ABN , First Publish Date - 2022-07-27T14:21:29+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ ఓ వ్యక్తికి షాక్ ఇచ్చింది....

shocking: విద్యుత్ నియోగదారుడికి బిగ్ షాక్

.ఇంటికి రూ.3,419 కోట్ల విద్యుత్ బిల్లు....బిల్లు చూసి అనారోగ్యం పాలైన ఇంటి యజమాని మామ

గ్వాలియర్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ ఓ వ్యక్తికి షాక్ ఇచ్చింది.మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌ నగరంలోని  శివ్ విహార్ కాలనీలోని  ప్రియాంక గుప్తా ఇంటికి రూ.3,419 కోట్ల విద్యుత్ బిల్లును జారీ చేయడంతో ఆమె మామగారు షాక్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ సంస్థ మానవ తప్పిదమంటూ చెప్పి ప్రియాంక గుప్తాకు 1,300 రూపాయల సరిదిద్దిన బిల్లును మళ్లీ జారీ చేసింది. దీంతో గుప్తా కుటుంబానికి ఉపశమనం కలిగింది. జులైలో గృహ వినియోగానికి సంబంధించిన విద్యుత్ బిల్లులో కోట్లాదిరూపాయలను చూసి తన తండ్రి అనారోగ్యం పాలయ్యాడని ప్రియాంక గుప్తా భర్త సంజీవ్ కంకనే చెప్పారు.


జులై 20న విడుదలైన విద్యుత్ బిల్లును మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్య క్షేత్ర విద్యుత్ విత్రన్ కంపెనీ (MPMKVVC) పోర్టల్ ద్వారా విడుదల చేశారు.ఆ తర్వాత బిల్లును రాష్ట్ర విద్యుత్ సంస్థ సరిచేసిందని కంకణే తెలిపారు.భారీ విద్యుత్ బిల్లుకు మానవ తప్పిదమే కారణమని, సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని ఎంపీఎంకేవీవీసీ జనరల్ మేనేజర్ నితిన్ మాంగ్లిక్ తెలిపారు.సాఫ్ట్‌వేర్‌లో వినియోగించిన యూనిట్ల స్థానంలో ఒక ఉద్యోగి వినియోగదారు నంబర్‌ను నమోదు చేయడంతో ఎక్కువ మొత్తంలో బిల్లు వచ్చిందని నితిన్ చెప్పారు. విద్యుత్ వినియోగదారునికి రూ.1,300 సరిచేసిన బిల్లును జారీ చేసినట్లు నితిన్ వివరించారు. లోపాన్ని సరిదిద్దామని, సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నామని మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ విలేకరులకు చెప్పారు. 


Updated Date - 2022-07-27T14:21:29+05:30 IST