అమరావతి: ఎంపీ మాధవ్ (MP Madhav) లాగానే ఓ మంత్రి బాగోతం ఉందని న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ (Jada Shravankumar) తెలిపారు. త్వరలో ఆ మంత్రి వ్యవహారం ఆధారాలతో బయటపెడతానని వెల్లడించారు. మంత్రి బాధితులు తనతో మాట్లాడారని చెప్పారు. మంత్రి అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోకపోవడం వల్ల గోరంట్లకు సీఎం జగన్ (CM Jagan) అలుసయ్యారని విమర్శించారు. గతంలో మంత్రులు రోజా, విడదల రజనీ చేసిన వ్యాఖ్యలను శ్రవణ్‌కుమార్ ప్రదర్శించారు. మాజీ మంత్రి పుష్పశ్రీవాణి టిక్‌టాక్‌లు చేస్తారని, దళితులు, గిరిజనులకు ఏం చేయరు? అని ప్రశ్నించారు. ఓటేసిన ప్రజలనే వైసీపీ నేతలు వెంటాడి, వేటాడి చంపుతున్నారని శ్రవణ్‌కుమార్ దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి