నల్గొండ: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యాదాద్రి పునఃప్రారంభానికి సీఎంవో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు. స్థానిక ఎంపీగా ఉన్న తనను పిలవలేదని అన్నారు. కేవలం అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను మాత్రమే ఆహ్వానించారని, దేవుడి దగ్గర సీఎం కేసీఆర్ బహు నీచ రాజకీయం చేయడం బాధాకరమని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి