మద్యనిషేధం డీఎంకే మేనిఫెస్టోలో లేదే..!

ABN , First Publish Date - 2022-04-24T17:12:14+05:30 IST

మద్యనిషేధం అమలు డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో లేదని ఆ పార్టీ ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కన్నియాకుమారి జిల్లా తోలైయావట్టం ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలలో

మద్యనిషేధం డీఎంకే మేనిఫెస్టోలో లేదే..!

                       - విద్యార్థినికి ఎంపీ కనిమొళి సమాధానం


పెరంబూర్‌(చెన్నై): మద్యనిషేధం అమలు డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో లేదని ఆ పార్టీ ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కన్నియాకుమారి జిల్లా తోలైయావట్టం ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీ కనిమొళి విద్యార్థినులతో చర్చాగోష్టి నిర్వహించారు. అందులో ఓ విద్యార్థిని మాట్లాడుతూ, రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం సాధ్యమా? మద్యం వల్ల పలు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, పోలీసులు కూడా మద్యానికి బానిసలవుతున్నారని, అందువల్ల మద్యం విక్రయాలు ఆపివేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇందుకు ఎంపీ కనిమొళి సమాధానం చెబుతూ, డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో సంపూర్ణ మధ్యనిషేధం గురించి ప్రస్తావించలేదన్నారు. మద్యనిషేధం సాధ్యం కాదని, అదే సమయంలో దుకాణాల సంఖ్య తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మరో విద్యార్థిని మాట్లాడుతూ, మద్యం దుకాణాల్లో పోలీసులకు మద్యం విక్రయించొద్దని కోరారు. ఇందుకు ఎంపీ సమాధానం చెబుతూ, మద్యం దుకాణాల్లో వృత్తిపరంగా చూస్తూ మద్యం విక్రయించడం లేదని, అదే సమయంలో వయస్సును బట్టి మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఎంపీ తెలిపారు.

Updated Date - 2022-04-24T17:12:14+05:30 IST