కొవిడ్-19పై రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం..

ABN , First Publish Date - 2021-06-20T01:42:21+05:30 IST

కొవిడ్-19 మహమ్మారి సహా ఇతర వ్యాధులపై పరిశోధన కోసం రాష్ట్ర వ్యాప్త పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు..

కొవిడ్-19పై రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం..

భోపాల్: కొవిడ్-19 మహమ్మారి సహా ఇతర వ్యాధులపై పరిశోధన కోసం రాష్ట్ర వ్యాప్త పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపినట్టు ఇవాళ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ పేర్కొన్నారు. ‘‘కొవిడ్-19 సహా ఇతర అంటు వ్యాధులపై అధ్యయనం చేసేందుకు భోపాల్‌లో ఓ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. ఈ ఇన్‌స్టిట్యూట్ ద్వారా వివిధ డిగ్రీ, డిప్లోమా కోర్సులు కూడా నిర్వహిస్తాం. ఆయా రంగాలకు చెందిన నిపుణులను ఇక్కడ నియమిస్తాం..’’ అని మంత్రి వెల్లడించారు. సామాజిక కారణాల వల్ల చాలా మంది మహిళలు తమకున్న ఆరోగ్య సమస్యలను బయటికి చెప్పుకోవడం లేదనీ.. దీనిపై మహిళల్లో చైతన్యం కలిగించి వారికి ఆరోగ్య పరీక్షలు చేసేందుకు ‘పింక్ క్యాంపెయిన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్టు సారంగ తెలిపారు.  పట్టణాలు మొదలు గ్రామాల్లోని పంచాయితీ స్థాయి వరకు దీన్ని అమలు చేస్తామన్నారు. 

Updated Date - 2021-06-20T01:42:21+05:30 IST