Mp Madhav Video: రికార్డెడ్‌కి రికార్డెడ్ అట?

ABN , First Publish Date - 2022-08-11T01:12:45+05:30 IST

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో (Mp Gorantla Madhav Video) రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. టీడీపీ....

Mp Madhav Video: రికార్డెడ్‌కి రికార్డెడ్ అట?

హైదరాబాద్: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో  (Mp Gorantla Madhav Video) రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. టీడీపీ (Tdp)... వైసీపీ  (Ycp)నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తప్పు తేలితే చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు అంటున్నారు.


అయితే అధికార పార్టీకి చెందిన వారు.. ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని.. తప్పు తేలితే చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత (Home Minister Taneti Vanitha)తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala RamaKrishna Reddy) తెలిపారు. కానీ అనంతపురం ఎస్పీ ఫకీరఫ్ప (Sp Pakirappa) ఆ వీడియో ఒరిజినల్ కాదని కొట్టిపారేశారు.


అసలు వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేమని.. ఆ వీడియో ఫేక్ అని తేల్చి చెప్పారు. బాధితులు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇదిలా ఉంటే తప్పును కప్పిపుచ్చునేందుకు గోరంట్ల మాధవ్... మీడియా సంస్థలపై ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. అసభ్యకర భాషను వాడుతూ దూషిస్తున్నారు. అలాగే కులం కార్డును ఉపయోగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘మాధవ్ వీడియో ఒరిజినల్ కోసం వెతుకుతున్నారట?. ఇప్పుడు వైరల్ అవుతున్నది రికార్డెడ్‌కి రికార్డెడ్ అట?. ఆ వీడియో ఉన్నది అసలు మాధవో కాదో కూడా చెప్పలేరట?. బాధితులు బయటకొచ్చి చెప్తేనే బూతు నిగ్గు తేలుతుందట?. కులంపై, మీడియాపై మళ్లీ మాధవ్ నోటి నుంచి డ్రైనేజీ కంపు?. చర్యలు తీసుకోవాల్సిన జగన్ బూతు ఎంపీకి సలహాలిచ్చారా?’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.




Updated Date - 2022-08-11T01:12:45+05:30 IST