Hindupur MP: గోరంట్ల మాధవ్ నోట మళ్ళీ అదే మాట..

ABN , First Publish Date - 2022-08-14T21:57:36+05:30 IST

న్యూడ్ వీడియోపై హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మళ్లీ అదే మాట మాట్లాడుతున్నారు.

Hindupur MP: గోరంట్ల మాధవ్ నోట మళ్ళీ అదే మాట..

అనంతపురం (Anantapuram): న్యూడ్ వీడియో (Nude video)పై హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) మళ్లీ అదే మాట మాట్లాడుతున్నారు. ఫేక్ వీడియో (Fake video)పై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇవాళ ఒక అడుగు ముందుకేసి బీసీ (BC)లను అణగదొక్కేందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. న్యూడ్ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి ఢిల్లీ (Delhi)లో ఉన్న ఎంపీ ఆదివారం హిందూపురంకు వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర కురవ సంఘం నేతలు స్వాగతం పలికారు.


పేక్ వీడియోపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఎంపీ గోరంట్ల పాతపాటే పాడారు. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలకు కౌంటర్ వేశారు. తన వీడియో నిజమని నిరూపించిన టీడీపీ నేతలు.. చంద్రబాబు (Chandrababu) ఓటుకు నోటు ఆడియోను అమెరికాలో ల్యాబ్‌లో టెస్టు చేయించి అది ఫేక్ అని తేల్చగలరా? అంటూ సెటైర్లు వేశారు. పోలీసులను స్వతంత్రంగా దర్యాప్తు చేయనీయండని గోరంట్ల కోరారు.

Updated Date - 2022-08-14T21:57:36+05:30 IST