AP News: ఎంపీ గోరంట్లపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధం!

ABN , First Publish Date - 2022-08-05T15:05:42+05:30 IST

ఏంపీ గోరంట్ల మాధవ్‌ సప్పెన్షన్ వేటుకు వైసీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

AP News: ఎంపీ గోరంట్లపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధం!

అమరావతి (Amaravathi): ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Gorantla Madhav)పై సస్పెన్షన్ (suspension) వేటుకు వైసీపీ ప్రభుత్వం (YCP govt.) రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎంపీ మాధవ్ వీడియోపై  శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి నిఘా వర్గాలు (Intelligence agencies) క్లారిటీ ఇచ్చాయి. దీంతో గోరంట్లపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలియవచ్చింది. ఇటువంటి అనైతిక కార్యక్రమాలను ఉపేక్షిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)భావిస్తున్నారు. అయితే ఇంకా నిర్ణయం తీసుకోవడంపై తర్జన బర్జన కొనసాగుతున్నట్లు సమాచారం.


ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారం అధికార వైసీపీని పెద్ద ఇరకాటంలోనే పడేసింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమా.. లేదంటే ఆయనతోనే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయించడమా అనే మీమాంసలో ఆ పార్టీ పెద్దలు పడిపోయారు. గోరంట్ల వీడియో నిజమని తేలితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడంతో.. ఎంపీపై సస్పెన్షన్‌ వేటు తప్పదనే అభిప్రాయానికి వైసీపీ వర్గాలు వచ్చాయి. ఈ దిశగా అధికార పార్టీకి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న చానళ్లకు లీకులు అందినట్లే కనిపిస్తోంది. సస్పెన్షన్‌ వేటు పడబోతోందని అవి ప్రసారం చేయడం దీనికి నిదర్శనం. కాగా.. గోరంట్ల వ్యవహారంలో మౌనం మంచిది కాదన్న అభిప్రాయానికి వైసీపీ అధిష్ఠానం వచ్చిందని అంటున్నారు. 

Updated Date - 2022-08-05T15:05:42+05:30 IST