AP News: ఎంపీ గోరంట్లను తక్షణమే పదవి నుంచి తొలగించాలి: టీడీపీ మహిళా నేతలు

ABN , First Publish Date - 2022-08-13T02:13:00+05:30 IST

Vijayawada : ఎంపీ గోరంట్ల (MP Gorantla Madhav) మాధవ్ న్యూడ్ వీడియో విషయంలో వైసీపీ(YSRCP) నేతల తీరును టీడీపీ మహిళా నాయకురాళ్లు ఆషా, తుపాకుల

AP News: ఎంపీ గోరంట్లను తక్షణమే పదవి నుంచి తొలగించాలి: టీడీపీ మహిళా నేతలు

Vijayawada : ఎంపీ గోరంట్ల (MP Gorantla Madhav) మాధవ్ న్యూడ్ వీడియో విషయంలో వైసీపీ(YSRCP) నేతల తీరును టీడీపీ మహిళా నాయకురాళ్లు ఆషా, తుపాకుల రమణమ్మ తూర్పారబట్టారు. మహిళల గౌరవానికి భంగం కలిగేంచేలా వ్యవహరించిన ఎంపీ గోరంట్లను వైసీపీ మంత్రులు వేనకేసుకురావడం దురదృష్టకరమన్నారు. చివరకు హోం మంత్రి కూడా ఎంపీ ఘటనను అన్ని కోణాల్లో చూడాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన ఎంపీ మాధవ్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala)పై కూడా వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆయన వీడియోలు కూడా బయటకు వస్తాయని పేర్కొన్నారు. తన పార్టీ నాయకుల నోరును అదుపులో పెట్టలేని  సీఎం జగన్ (CM Jagan) పాలనకు అనర్హుడని పేర్కొన్నారు.  

Updated Date - 2022-08-13T02:13:00+05:30 IST