హైదరాబాద్ సిటీ/సైదాబాద్ : తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదల కాగానే బీజేపీలో చేరనున్నారని, కేంద్ర నాయకత్వం కూడా ఎదురుచూస్తున్నదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తెలిపారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న తీన్మార్ మల్లన్నను సోమవారం ఎంపీ అర్వింద్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల అవినీతిని ప్రశ్నించినందుకే తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేశారని తెలిపారు. వరుస కేసులు సాకుగా చూపి పీడీ యాక్ట్ కేసు నమోదు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పారు. కేసులపై హైకోర్టు సైతం చివాట్లు పెట్టిందని పేర్కొన్నారు.