సామాజిక దూరమే సరైన మందు

ABN , First Publish Date - 2020-04-04T10:06:18+05:30 IST

కరోనా వైరస్‌కు మందులేదని దీనిని పూర్తిగా నియంత్రించాలంటే సామాజిక దూరమే సరైన మందు అని కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ అన్నారు.

సామాజిక దూరమే సరైన మందు

 పేదల కోసం ఎంపీ నిధులు వాడుకోండి: ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌


ఆదోని రూరల్‌, ఏప్రిల్‌ 3: కరోనా వైరస్‌కు మందులేదని దీనిని పూర్తిగా నియంత్రించాలంటే సామాజిక దూరమే సరైన మందు అని కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితో కలిసి ఆదోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ వార్డును పరిశీలించారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి కావాల్సిన పరికరాలను ఎంపీ నిధుల ద్వారా కొనుగోలు చేసుకోవాలని, పేద రోగుల కోసం ఎంపీ నిధుల నుంచి ఏమైనా కొనుగోలు చేసుకోవాలని ఆసుపత్రి సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ లింగన్నకు తెలిపారు. అనంతరం ఎంపీ నిధుల నుంచి కొనుగోలు చేసిన 5 వేల శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ జూన్‌లోగా ఆసుపత్రికి అవసర మయ్యే అన్ని పరికరాలను కొనుగోలు చేసుకోవాలని అన్నారు. పేదల కోసం ఆసుపత్రి ఆవరణలో జనరిక్‌ మెడికల్‌ షాపు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఆసుపత్రిలో వెంటిలేటర్లు, మందులు, మాస్కులు, శ్యానిటైజర్లు వంటి వాటిని తన నిధుల ద్వారే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లింగన్న, ఆర్డీవో బాలగణేశయ్య, తహసీల్దార్‌ రామకృష్ణ, తాలుకా ఎస్‌ఐ రామాంజులు, మున్సిపల్‌ కమిషనర్‌ సుబ్బారావు, డాక్టర్లు పద్మకుమార్‌, సత్యనారాయణ, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

పత్తికొండ: కరోనా(కోవిడ్‌-19) వైరస్‌ నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని ఎంపీ సంజీవ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే శ్రీదేవితో కలసి ఆయన పత్తికొండ ప్రభుత్వాసుపత్రితోపాటు క్వారంటైన్‌ సెంటర్‌ను పరిశీలించారు. సిబ్బంది సేవలను కొనియాడారు. 

Updated Date - 2020-04-04T10:06:18+05:30 IST