ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తుంది: ఎంపీ సీఎం రమేష్‌

ABN , First Publish Date - 2021-12-24T21:25:34+05:30 IST

ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తుందని ఎంపీ సీఎం రమేష్‌ అన్నారు.

ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తుంది: ఎంపీ సీఎం రమేష్‌

అమరావతి: ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తుందని ఎంపీ సీఎం రమేష్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం పోలీసులు ఎందుకు వ్యవహరించడం లేదు? అని ప్రశ్నించారు. పార్టీలు అధికారంలోకి వస్తాయి..పోతాయి.. వ్యవస్థలు ముఖ్యమనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు.రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకుంటుందని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఈ నెల 28న బీజేపీ సభ నిర్వహిస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని అవలంభిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి సినిమా టికెట్‌ రేట్లపై ఉన్న శ్రద్ధ..ప్రజా సమస్యలపై లేదన్నారు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారా? అని ప్రశ్నించారు. మద్యం ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దశలవారీ మధ్య నిషేధం కాదు.. దశలవారీ మద్యపాన వినియోగాన్ని ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-24T21:25:34+05:30 IST