రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు సేవలు

ABN , First Publish Date - 2022-08-18T05:50:10+05:30 IST

రైతులకు అవసరమైన వరి వంగడాల నుంచి ధాన్యం కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రం సేవలు అందిస్తుందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు.

రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు సేవలు
ఆర్బీకే ప్రారంభ శిలాఫలకం ఆవిష్కరిస్తున్న బోస్‌

పెనుమంట్ర, ఆగస్టు 17: రైతులకు అవసరమైన వరి వంగడాల నుంచి ధాన్యం కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రం సేవలు అందిస్తుందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. మార్టేరులో నిర్మిం చిన రైతు భరోసా కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారం భించారు. దళారుల వల్ల నష్టపోకుండా నేరుగా రైతులకు సేవలందిస్తున్నామన్నారు. శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, జడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి, ఎంపీపీ కర్రి వెంకట నారాయణరెడ్డి, సర్పంచ్‌ మట్టా కుమారి, ఎంపిటిసీల పాల్గొన్నారు. 


పెనుగొండ: స్థానిక నగరేశ్వరస్వామి కాలనీలో (బీడు) నిర్మించనున్న  ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ కమ్యూనిటీ హాలుకు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభా ష్‌ చంద్రబోస్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాఽథ రాజు, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, జడ్పీ చైర్మన్‌ కౌరు శ్రీనివాస్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వెద్యం అందించేందు కు చర్యలు చేపట్టిందన్నారు. కరోనా సమయంలో పీఎంపీల సేవలు ప్రశంసనీయ మన్నారు. కార్యక్రమంలో చిరంజీవిరెడ్డి, వెలగల శ్రీనివాసరెడ్డి, తిక్కిరెడ్డి పవన్‌, చంటి, తానేటి మల్లేశ్వరరావు, తానేటి రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:50:10+05:30 IST