Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీసులు చోద్యం చూశారు: ఎంపీ భరత్‌

తూర్పు గోదావరి: సీతానగరంలో వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన దళిత లెక్చరర్‌ దీపక్‌ను ఎంపీ మార్గాని భరత్ పరామర్శించారు. లెక్చరర్‌ దీపక్‌పై దాడి ఘటనపై ఎంపీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. లెక్చరర్‌పై 100 మంది దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని భరత్‌ ఆరోపించారు. దాడి చేసినవారిపై లాఠీఛార్జ్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదని భరత్‌  ప్రశ్నించారు. దీపక్‌పై దాడి ఘటనను హోంమంత్రి, డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ భరత్‌ పేర్కొన్నారు. 


కేసు నమోదు

  సీతానగరంలో దళిత లెక్చరర్ దీపక్‌పై దాడి చేసిన ఘటనలో శ్రీకాంత్, రామకృష్ణ, అంబటి రమణ, చిరంజీవిలపై పోలీసులు కేసు నమోదు చేసారు.  

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement