Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో రాణించాలి: ఎంపీ

మట్టెవాడ, అక్టోబరు 26 : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రాజ్యసభ సభ్యుడు తెలంగాణ జూడో అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌ అన్నారు. పోచమ్మమైదాన్‌ కెమిస్ట్‌ భవన్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి సబ్‌ జూనియర్‌ జూడో పోటీలను మంగళవారం బండా ప్రకాశ్‌ ప్రారంభించారు. సబ్‌ జూనియర్‌ పోటీల్లో ప్రతి భ కనబరిచిన వారు ఈ నెల 28న కరీంనగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి జూడో సెలక్షన్స్‌లో పాల్గొంటారని జూడో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కోశాధికారి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధానకార్యదర్శి బి.కైలాష్‌ యాదవ్‌ తెలిపారు. కార్యక్రమంలో 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ బస్వరాజు కుమారస్వామి, లావా స్పోర్ట్స్‌ వ్యవస్థాపకులు ఎం. కమలాకర్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల క్రీడల అభివృద్ధి అధికారులు ఇందిర, అశోక్‌ కుమార్‌, జై జవాన్‌, జైకిసాన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, జూడో కోచ్‌లు నాగరాజు, వీరస్వామి, భాస్కర్‌, సంతోష్‌, నిశాంత్‌, కిరణ్‌, సాయిరాం యాదవ్‌, కుమారస్వామి, లింగమూర్తి, రాజు, 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement