జవాన్‌ కళ్యాణ్‌రావు మృతి కలిచివేసింది

ABN , First Publish Date - 2021-06-25T05:47:12+05:30 IST

జవాన్‌ దాదన్నగారి కళ్యాణ్‌రావు మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. గురువా రం వెంకటాపూర్‌ గ్రామానికి వచ్చిన ఎంపీ అమర జవాన్‌ కళ్యాణ్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అ ర్పించారు.

జవాన్‌ కళ్యాణ్‌రావు మృతి కలిచివేసింది
జవాన్‌ కళ్యాణ్‌రావుకు నివాళులు అర్పిస్తున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌

నివాళులు అర్పించిన ఎంపీ అర్వింద్‌
మాక్లూర్‌/ధర్పల్లి/జక్రాన్‌పల్లి జూన్‌ 24: జవాన్‌ దాదన్నగారి కళ్యాణ్‌రావు మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. గురువా రం వెంకటాపూర్‌ గ్రామానికి వచ్చిన ఎంపీ అమర జవాన్‌ కళ్యాణ్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అ ర్పించారు. అనంతరం ఆయన కళ్యాణ్‌రావు కుటుంబసభ్యు లను పరామర్శించారు. ఆ తర్వాత మండలంలోని ఢీకంపల్లి గ్రామానికి చెందిన జిలకర సురేష్‌, యోగేష్‌ ఇటీవల ఎస్సా రెస్పీలో ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబ స భ్యులను ఎంపీ పరామర్శించి రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే, ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన ప్రణయ్‌ ఇటీవల పిడుగుపాటుతో మృతిచెందగా అతడి కు టుంబ సభ్యులను ఎంపీ పరామర్శించి రూ.50వేల నగదు అందజేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ధన్‌పా ల్‌ సూర్యనారాయణగుప్తా తనవంతు రూ.20వేలు అందజేశారు. అనంతరం జే.శ్రీనివాస్‌ తండ్రి కిష్టయ్య ఇటీవల మృ తిచెందడంతో ఆయన కుటుంబాన్ని ఎంపీ పరామర్శించా రు. ఆ తర్వాత బ్రహ్మణ్‌పల్లి గ్రామానికి చెందిన జక్రాన్‌పల్లి మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు భీమ్‌రాజ్‌ ఇటీవల కరోనా తో మృతి చెందగా ఆయన కుటుంబసభ్యులను ఎంపీ పరా మర్శించారు. యానంపల్లి మాజీ సర్పంచ్‌ సోదరి, సోదరు డు కరోనాతో ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాల ను ఎంపీ పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్సయ్య, ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌ చార్జి వినయ్‌ కుమార్‌రెడ్డి, రూరల్‌ ఇన్‌చార్జి కులచారి దినే ష్‌, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షు డు శ్రీనివాస్‌గౌడ్‌, చందమియాబాగ్‌ సర్పంచ్‌ కిషన్‌నాయక్‌, ప్రధాన కార్యదర్శి నరేందర్‌, బీజేపీ నాయకులు రాజేందర్‌, పోశన్న, లోలం గంగారెడ్డి, నాయుడి రాజన్న, పాల్ది గంగాదాసు, గోపాల్‌, దాసు, మహేష్‌ పాల్గొన్నారు.
పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి
డిచ్‌పల్లి: జిల్లాలో బీజేపీ బలోపేతం కోసం పార్టీ సీనియ ర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఎంపీ అర్వింద్‌ సూచించారు. గు రువారం డిచ్‌పల్లిలో శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సంద ర్భంగా డిచ్‌పల్లిలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎంపీ అర్వింద్‌ మొక్క నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూమన్న, వైస్‌ ఎంపీపీ శ్యాంరావు, పార్టీ మండల అధ్యక్షుడు యాదగిరి వెంకటరమణ, ప్రధానకార్యదర్శి చం ద్రకాంత్‌, నాయకులు బాగారెడ్డి, రాజగౌడ్‌, సతీశ్‌, శివరెడ్డి, సంతోషం, గణేశ్‌, సాయి, విఠల్‌ పాల్గొన్నారు.
దత్త గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా
నందిపేట: దత్తత గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చే స్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. గురువారం నం దిపేట మండలంలోని తన దత్తత గ్రామమైన వెల్మల్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ స్థానిక సర్ప ంచ్‌ మచ్చర్ల సాయమ్మ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. వెల్మల్‌ గ్రామ అభివృద్ధికి ఎలాంటి కార్యక్ర మాలు చేపట్టారో అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థుల కోరిక మేరకు వెల్మల్‌లో మూడు అంగన్‌వాడీ సెంటర్‌లు, ప్రభు త్వ పాఠశాలలో వంటగది, సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.కోటి 40లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

Updated Date - 2021-06-25T05:47:12+05:30 IST