Kavitaకు హిందుత్వం గుర్తొచ్చినందుకు సంతోషం: MP Arvind

ABN , First Publish Date - 2022-06-08T21:06:29+05:30 IST

టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ (Arvind) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Kavitaకు హిందుత్వం గుర్తొచ్చినందుకు సంతోషం: MP Arvind

Hyd: టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ (Arvind) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తమకు అవసరమైనప్పుడు మంత్రి కేటీఆర్ (KTR) సలహాలు తీసుకుంటామని సెటైర్లు వేశారు. ఎమ్మెల్సీ  కవిత (kavita)కు హిందుత్వం గుర్తొచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. బైంసాలో హిందువులపై దాడులను ఆపాలని ఆయన కవితకు విజ్ఞప్తి చేశారు. సెస్పెండ్ ఎవర్ని చేయాలో...‌ ఎవరికి బాధ్యతలు ఇవ్వాలో బీజేపీ నాయకత్వానికి తెలుసునని, కేటీఆర్‌తో చెప్పించుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదన్నారు. తెలంగాణలో అత్యాచారాలపై ప్రభుత్వం పెద్దలు ఏమి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని ముఖ్యమంత్రి కొడుకు బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నారన్నారు. గ్రూప్ వన్ పరీక్షలో ఉర్థూ భాషను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏమి చేశారో సీఎం, కేటీఆర్, సోమేష్ కుమార్ సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి జీతాలు, పెన్షన్లు ఇవ్వటం సిగ్గుచేటన్నారు. నాలుగు రోజుల్లో పాఠశాలలు ప్రారంభం అవుతున్నప్పటకీ.. పుస్తకాల కోసం టెండర్లకు పిలవకపోవటం దారుణమని, ఆహారం, ఆరోగ్యం, ఆవాసం తెలంగాణలో అటకెక్కాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.

Updated Date - 2022-06-08T21:06:29+05:30 IST