Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీఆర్ఎస్‌ ఎంపీలవి దొంగ నాటకాలు: ఎంపీ అర్వింద్

ఢిల్లీ: పార్లమెంట్‌లో టీఆర్ఎస్‌ ఎంపీలవి దొంగ నాటకాలని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం పన్ను తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదు? అని ఆయన ప్రశ్నించారు. పైగా ఆర్టీసీ చార్జీలు పెంచుతామని ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. రైతు ఉత్పత్తులపై టీఆర్ఎస్ నేతలు స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లుగా కేంద్రం 300 శాతం వరిధాన్యాన్ని సేకరిస్తోందని పేర్కొన్నారు. ఎంత కొంటామో చెప్పాం..ఎక్కువ ధాన్యం ఉన్నా కొంటామన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రజలను కేసీఆర్‌ మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు. 


Advertisement
Advertisement