Advertisement
Advertisement
Abn logo
Advertisement

మూడుసార్లు డాక్టర్ కాళ్ళు మొక్కిన MP.. ఆ తర్వాత కొద్ది గంటలకే వచ్చిన ఆర్డర్ చూసి నివ్వెరపోయిన వైద్యుడు

ఇంటర్నెట్ డెస్క్: ఆయన ఒక ఎంపీ. ఆయన తలచుకుంటే.. సంక్రమంగా విధులు నిర్వర్తించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. అయితే సదరు ఎంపీ.. అటువంటిదేమీ చేయలేదు. హాస్పటల్‌కు ఆలస్యంగా వచ్చిన డాక్టరును కనీసం పల్లెత్తి మాట కూడా అనలేదు. అలా అని.. సదరు డాక్టర్‌పై చర్యలూ తీసుకోలేదు. కానీ ఆ వైద్యుడి వైఖరిలో మార్పు తేవడం కోసం.. ఎంపీ తన పదవిని కూడా పక్కనపెట్టి గాంధీయ మార్గాన్ని అనుసరించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తర్వాత కొద్ది గంటలకే వచ్చిన ఆర్డర్ చూసి సదరు వైద్యుడు నివ్వెరపోయాడు. విషయంలోకి వెళితే..


రాజ్‌గఢ్ పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ రోడ్మల్ నగర్.. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ నెల 25న పచౌరి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులోని రోగులకు పండ్లు పంచాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకే ఎంపీ.. ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే  అప్పటికీ అందులో పని చేసే వైద్యుడు విధులకు హాజరుకాలేదు. ఈ విషయం తెలిసి ఎంపీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా.. ఆసుపత్రికి ఎంపీ వచ్చినట్లు సమాచారం అందుకున్న వైద్యుడు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు. ఈ క్రమంలో వైద్యుడి కోసం ఆసుపత్రి గుమ్మం వద్దే ఎదురు చూస్తున్న ఎంపీ.. డాక్టర్ రాగానే ఆయనను మందలించలేదు. గాంధేయ మార్గంలో మూడుసార్లు డాక్టర్ కాళ్లు మొక్కాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు.. సదరు వైద్యుడిని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement