Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్‌ను 100 శాతం జైలుకు పంపుతాం: ఎంపీ అరవింద్

ఢిల్లీ: రెండు రోజులుగా టీఆర్ఎస్ దొంగలు, గజదొంగ కేసీఆర్ చెప్పినట్లు పార్లమెంట్లో ప్రవర్తిస్తున్నారని ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తే రాష్ట్రప్రభుత్వం ఎందుకు తగ్గించలేదు? అని ప్రశ్నించారు. పైగా డీజిల్ ధరలు పెరిగినందుకు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు ఉత్పత్తుల మీద టీఆర్ఎస్ నాయకులు స్మగ్లింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 5 సంవత్సరాలలో కేంద్రప్రభుత్వం 300శాతం వరిధాన్యాన్ని సేకరిస్తుందన్నారు. రైతులను మభ్యపెడుతున్న కేసీఆర్ ముందు టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చెయ్యాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రజల సమస్యలు, రైతులు, నిరుద్యోగులు , ఆర్టీసీ ఛార్జీల ధరలపై పెంపు పై పోరాడతామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను 100 శాతం జైలుకు పంపుతామన్నారు. సీబీఐ, ఈడీ త్వరలో కేసీఆర్ కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై విచారణ ప్రారంభిస్తాయని వ్యాఖ్యానించారు. లిఖిత పూర్వకంగా ఎంత కొంటామో చెప్పామని, ఎక్కువ ధాన్యం ఉన్నా కొంటామన్నారు. 

Advertisement
Advertisement