ఉపాధిహామీ అధికారుల పని తీరుపై ఎంపీపీ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-01-29T04:49:29+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అధికారుల పనితీరుపై ఎంపీపీ చాందిబాయిచౌహాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపాధిహామీ అధికారుల పని తీరుపై ఎంపీపీ ఆగ్రహం

 నారాయణఖేడ్‌, జనవరి 28: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అధికారుల పనితీరుపై ఎంపీపీ చాందిబాయిచౌహాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నారాయణఖేడ్‌లో నిర్వహించిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. పేదలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెడితే అధికారులు పనులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా తమ పని తీరును మార్చుకోవాలని సూచించారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సకాలంలో బిల్లులు అందజేయాలని సర్పంచులు కోరారు. సమావేశంలో జడ్పీటీసీ లక్ష్మీబాయిరవీందర్‌నాయక్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-01-29T04:49:29+05:30 IST