టికెట్‌ డబుల్‌?

ABN , First Publish Date - 2021-04-08T08:08:35+05:30 IST

‘‘లాక్‌డౌన్‌ వల్ల చాలా నష్టపోయాం... పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు తొలి రెండు వారాల్లోనే మొత్తం పెట్టుబడిని రాబట్టుకోవాలి... ఇది జరగాలంటే టికెట్‌ ధరను రూ.300కు పెంచాలి’’ అన్నది నిర్మాతలు, పంపిణీదారుల ప్రతిపాదన. కాగా ఎగ్జిబిటర్ల వాదన భిన్నంగా ఉంది. ‘‘టికెట్‌ ధర రూ.300 పెంచడం సరికాదు. ఇది ప్రేక్షకులకు భారమవుతుంది.

టికెట్‌ డబుల్‌?


  • -ధరలు పెంచే యోచనలో సినీ నిర్మాతలు
  • -విజయవాడలో నేడు రాష్ట్రస్థాయి సమావేశం

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

‘‘లాక్‌డౌన్‌ వల్ల చాలా నష్టపోయాం... పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు తొలి రెండు వారాల్లోనే మొత్తం పెట్టుబడిని రాబట్టుకోవాలి... ఇది జరగాలంటే టికెట్‌ ధరను రూ.300కు పెంచాలి’’ అన్నది నిర్మాతలు, పంపిణీదారుల ప్రతిపాదన. కాగా ఎగ్జిబిటర్ల వాదన భిన్నంగా ఉంది. ‘‘టికెట్‌ ధర రూ.300 పెంచడం సరికాదు. ఇది ప్రేక్షకులకు భారమవుతుంది. ప్రస్తుతం ఉన్న ధరను రూ.200-250 పెంచితే సరిపోతుంది. నిర్మాతలు టికెట్‌ ధర ఎంత పెంచినా కొత్త ధరల ప్రకారమే మా వాటాను నిర్ణయించాలి’’ అంటున్నారు. 


బాహుబలితో ప్రారంభం

అగ్ర హీరోల చిత్రాలు విడుదలైనప్పుడు వారం రోజులపాటు టికెట్‌ ధరలను పెంచుకునే వెసులుబాటు ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వమే ప్రత్యేకం గా ఉత్తర్వులు జారీ చేస్తోంది. బాహుబలి చిత్రం విడుదలైనపుడు మొదలైన ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ నెల, వచ్చే నెలలో ప్రముఖ హీరోల చిత్రా లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 


ధరల పెంపుపై భిన్నాభిప్రాయాలు

రాష్ట్రంలో మొత్తం 1200 థియేటర్లు ఉన్నాయి. వీటి లో సుమారుగా 150 వరకూ మల్టీప్లెక్స్‌ స్ర్కీన్లు ఉన్నా యి. మల్టీప్లెక్స్‌లో రూ.200, రూ.150 టికెట్‌ ధరలు ఉన్నాయి. సింగిల్‌ థియేటర్లలో రూ.150, రూ.125 వరకూ ఉన్నాయి. కొన్ని మల్టీప్లెక్స్‌లో టికెట్‌ ధరలు రూ.184, రూ.112గా ఉన్నాయి. కొత్త సినిమాలు విడుదల కానుండటంతో టికెట్‌ ధరలను రూ.300 చేయాల ని పంపిణీదారులు, నిర్మాతలు భావిస్తున్నారు. 


వాటాపై ఎగ్జిబిటర్ల పట్టు 

రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌లు ఎక్కువగా బడా నిర్మాతల చేతుల్లోనే ఉన్నాయి. ఇక, సింగిల్‌ థియేటర్లు ఎగ్జిబిటర్ల చేతుల్లో ఉన్నా, సినిమాను బట్టి పంపిణీదారులు వారి కి వాటా ఇస్తున్నారు. ఒకరోజు ఆదాయంలో 65 శాతం వాటాను పంపిణీదారులు తీసుకుంటుంగా, మిగిలిన 35 శాతాన్ని ఎగ్జిబిటర్లకు ఇస్తున్నారు. ఎగ్జిబిటర్లకు ఇ చ్చే వాటాను కొత్తగా నిర్ణయించే ధరల ప్రకారం ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విష యం నిర్మాతలు, పంపిణీదారులకు చేరింది.


దీనిపై చర్చించేందుకు హైదరాబాద్‌కు రావాలని ఎగ్జిబిటర్లకు నిర్మాతలు కబురు పంపారు. ఏపీకి విజయవాడలోనే ఫిలిం చాంబర్‌ ఉన్నందున ఇక్కడే మాట్లాడుకుందామని వారికి ఎగ్జిబిటర్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఎగ్జిబిటర్లు విజయవాడలో ఉన్న తెలుగు ఫిలించాంబర్‌లో గురువారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.   కాగా, కరోనా ప్రభావంతో ఓటీటీకి డిమాండ్‌ పెరిగింది. కొత్త చిత్రాలు ఓటీటీ వేదికపై అందుబాటులో ఉన్నా యి. దీంతో థియేటర్లలో విడుదలయ్యే కొత్త చిత్రాలను నాలుగు, ఐదు వారాల వరకూ ఓటీటీలో విడుదల చేయకూడదని ఎగ్జిబిటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2021-04-08T08:08:35+05:30 IST