న్యూయార్క్‌లో సినిమా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్!

ABN , First Publish Date - 2020-10-18T21:46:26+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. కరోనా కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్లను తిరిగి తెరిచేందుకు న్యూయార్క్ గవర్నర్ అండ్రూ

న్యూయార్క్‌లో సినిమా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్!

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. కరోనా కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్లను తిరిగి తెరిచేందుకు న్యూయార్క్ గవర్నర్ అండ్రూ క్యూమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో కరోనా విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో అగ్రరాజ్యం స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు సహా ఇతర అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. అయితే ఆర్థిక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని, కరోనా కారణంగా విధించిన ఆంక్షలను క్రమంగా సడలించింది. ఈ క్రమంలో పాఠశాలలు సహా ఇతర కార్యాలయాలు కూడా తెరుచుకున్నాయి. 


అయితే సినిమా థియేటర్లపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం అలాగే కొనసాగించింది. ఈ క్రమంలో గ్లోబల్ సినిమా ఫెడరేషన్.. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు బహిరంగ లేఖ రాసింది. సినిమా థియేటర్లను తిరిగి ప్రారంభించేందుకు అంగీకరించాలని లేఖలో కోరింది. గ్లోబల్ సినిమా ఫెడరేషన్ రాసిన లేఖపై ఆండ్రూ క్యూమో సానుకూలంగా స్పందించారు. కొన్ని ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో 25శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లను నడుపుకొనేందుకు గవర్నర్ అంగీకరించారు. ప్రేక్షకులు తప్పని సరిగా ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా.. న్యూయార్క్ నగరంలోని సినిమా థియేటర్లను తెరిచేందుకు మాత్రం ఆండ్రూ క్యూమో అంగీకరించలేదు. 


Updated Date - 2020-10-18T21:46:26+05:30 IST