Sep 26 2021 @ 09:03AM

'లవ్ స్టోరీ'పై ప్రశంసలు కురిపిస్తున్న సినీ తారలు..

తాజాగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'లవ్ స్టోరీ' మూవీపై అలాగే టీంపై సినీ తారల ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి 'ఫిదా' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన మరో అందమైన ప్రేమ కథ 'లవ్ స్టోరి'. ఇందులో అక్కినేని నాగ చైతన్య - నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఫిదా చేస్తున్న సాయి పల్లవి జంటగా నటించారు. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మించారు. ఏఆర్ రెహమాన్ వద్ద పనిచేసిన పవన్ సిహెచ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజైంది. మొదటిరోజు నుంచే అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది చైతు - సాయి పల్లవిల లవ్ స్టోరి. ఈ మూవీపై పలువురు టాలీవుడ్ సినీ తారలు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


సూపర్ స్టార్ మహేశ్ బాబు.."శేఖర్ కమ్ముల దర్శకత్వం బాగుంది. నాగ చైతన్యలోని నటుడిని బయటకు తీసుకొచ్చిన చిత్రం 'లవ్ స్టోరీ'. ఆయనకు ఈ మూవీ గేమ్ చేంజర్. సంగీత దర్శకుడు పవన్ సిహెచ్ సెన్సషనల్ మ్యూజిక్ అందించారు. వాట్ ఏ మ్యూజిక్.. ఏఆర్ రెహమాన్ గారు ఆయన మీ శిష్యుడని విన్నాను. మరు ఖచ్చితంగా ఆయన గురించి గర్వపడతారు. ఈ టెస్టింగ్ సమయంలో 'లవ్ స్టోరీ' నిర్మాతలు ఇండస్ట్రీకి  బ్లాక్ బస్టర్ మూవీని ఇచ్చారు" అంటూ చిత్రబృందం ప్రతి ఒక్కరినీ మహేష్ అభినందించారు. అలాగే సాయి పల్లవిని ఇంకా ప్రత్యేకంగా ప్రశంసించారు. "సాయి పల్లవి ఎప్పటిలాగే సెన్సేషనల్.. ఈ అమ్మాయికి అసలు బోన్స్ ఉన్నాయా..? ఇప్పటి వరకూ సిల్వర్ స్క్రీన్‌పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం నేను చూడలేదు. ఆమె కలలా కదులుతుంది" అంటూ సాయి పల్లవిని పొగడ్తలతో ముంచేశారు.