దివ్యాంగుల కుటుంబానికి..సినీ నిర్మాత ‘చదలవాడ’ భరోసా

ABN , First Publish Date - 2020-10-27T11:50:31+05:30 IST

నిజాంపేటలో ఒకే ఇంట్లో నలుగురు దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆ కుటుంబానికి అండగా నిలిచారు

దివ్యాంగుల కుటుంబానికి..సినీ నిర్మాత ‘చదలవాడ’ భరోసా

గృహ నిర్మాణానికి భూమిపూజ


నిజాంపేట, అక్టోబరు 26: నిజాంపేటలో ఒకే ఇంట్లో నలుగురు దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఆదివారం నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు, మాతృదేవోభవ సినిమా దర్శకుడు అజయ్‌కుమార్‌ దివ్యాంగుల కుటుంబ నూతన గృహ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. రూ.లక్ష నగదుతో పాటు ఆ కుటుంబానికి  కావాల్సిన నిత్యావసర వస్తువులను అందజేశారు. మీడియా ద్వారా దివ్యాంగుల గురించి కథనాలు రావడంతో దేశ విదేశాల నుంచి పలువురు  లక్షలాది రూపాయలు విరాళంగా పంపినట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో బి.డీఎల్‌.విన్నర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు అరిక పూడి రఘు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-27T11:50:31+05:30 IST