కుర్రాళ్ల కథ

ABN , First Publish Date - 2020-07-15T05:30:00+05:30 IST

ఓ తండ్రి... తన కొడుకు ఇంకా ఇంజనీరింగ్‌ పూర్తి చేయలేదనే కోపం. వాళ్లూ వీళ్లూ అందరూ సెటిలైపో తున్నా మావాడు ఎటూ కాకుండా పోతున్నాడనే బాధ. పెళ్లి చేస్తే ఈ ఆకతాయి తిరుగుళ్లన్నీ పోయి పిల్లాడు జీవితంలో స్థిరపడతాడని పెద్దల సలహా!...

కుర్రాళ్ల కథ

ఓ తండ్రి... తన కొడుకు ఇంకా ఇంజనీరింగ్‌ పూర్తి చేయలేదనే కోపం. వాళ్లూ వీళ్లూ అందరూ సెటిలైపో తున్నా మావాడు ఎటూ కాకుండా పోతున్నాడనే బాధ. పెళ్లి చేస్తే ఈ ఆకతాయి తిరుగుళ్లన్నీ పోయి పిల్లాడు జీవితంలో స్థిరపడతాడని పెద్దల సలహా! ఆ కొడుకు... ఇవేమీ పట్టించుకోని క్యారెక్టర్‌. పేరు చందు. నాన్న చివాట్లు భరించలేక లెక్చరర్‌ ఇంటికి వెళతాడు అతడు. ‘మనకు కావల్సింది నేర్చు కోవడమా? వాళ్లు చెప్పింది నేర్చుకోవ డమా?’ అని ఆయన్ని అడుగుతాడు. అందుకు లెక్చరర్‌... ‘ఇక్కడున్నదంతా బట్టీ ప్రపంచమేరా! ఎవడినన్నా క్వశ్చన్‌ అడిగితే గుక్క తిప్పుకోకుండా ఆన్సర్‌ చెప్పేస్తాడు. కానీ దాని థియరీ... ఎవడికీ తెలియదు. నీకు మిగిలింది నాలుగు సబ్జెక్ట్‌లే కదా! నేనున్నానుగా! టెన్షన్‌ తీసుకోకు’’ అంటాడు. అయితే ఇలా బట్టీలు కొట్టి పాస్‌ అవ్వడం తనకు ఇష్టం లేదంటాడు చందు. ‘అలా చేసి ప్రపంచాన్ని మోసం చేయవచ్చేమో కానీ... నన్ను నేను మోసం చేసు కోలేనం’టాడు. 


అదే సమయంలో చందు స్నేహితు డొకరు వచ్చి, తనకు అమెరికాలో ఉద్యోగం వచ్చిందని చెబుతాడు. ‘ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చుగా’ అని చందుకు సలహా ఇస్తాడు. తనకు తన తండ్రిలా మంచి బిజినెస్‌మ్యాన్‌ కావాలని ఉందంటాడు చందు. అందులో ఏముందంటూ స్నేహితుడు అవహేళనగా మాట్లాడతాడు. చందు కోపంగా... ‘నీకు చదువంటే ఇంట్రస్ట్‌. నాకు లేదు. బిజినెస్‌ చేసుకొంటా. అయినా నీలా నన్ను ఉండమంటావేంటిరా? నువ్వయినా... నేనయినా పనిచేసేది డబ్బు సంపాదించడం కోసం... జీవితంలో ఎదగడం కోసమే కదా’ అంటాడు. చుట్టుపక్కల వాళ్లకు వాళ్ల ఇంట్లో ఏం జరుగుతుందనేకంటే పక్కింటివాడు ఏం చేస్తున్నాడన్నదానిపైనే ఆసక్తి ఎక్కువనేది చందు అభిప్రాయం. ఇంతలో చందుకు సంబంధం చూడమని సిద్ధాంతికి చెబుతాడు వాళ్ల నాన్న. అయితే అతడికి చదువు, ఉద్యోగం లేకపోవడంతో సిద్ధాంతి సంబంధం చూడలేనంటాడు. దీంతో చందును తిడతాడు తండ్రి.


‘‘నాన్నా..! నేను ఫెయిలయింది నాలుగు సబ్జెక్ట్‌లే. జీవితంలో కాదు. చిన్నప్పటి నుంచి అందరి ముందు ‘మావాడు ఏమీ చదవడండీ! వాడికి బుర్ర తక్కువండీ’ అని అంటూనే ఉన్నావు కదా. వినీ వినీ నేను కూడా నాకు బుర్ర తక్కువేమోనని ఫిక్సయ్యా. అయిపోయిందేదో అయిపోయింది. ఏం చేయాలో ఇప్పుడు నాకు బాగా స్పష్టత ఉంది. ఇకనైనా నన్ను ప్రోత్సహించు’’ అని వేడుకొంటాడు. ప్రపంచంలో సక్సెస్‌ అయిన ప్రతి ఒక్కరూ చదువులో టాపర్లు కాదని, ఇష్టపడిన దాంట్లో కష్టపడితేనే విజయం సాధించగలుగుతామని చెబుతాడు చందు. ఇది టమడా మీడియా రూపొందించిన ‘పక్కింటి కుర్రాడు’ షార్ట్‌ ఫిలిమ్‌ కథ. రచన, దర్శకత్వం చందు సాయి. అతడే చందుగా చక్కగా నటించాడు. ఈ కాలం కుర్రాళ్లకు బాగా కనెక్ట్‌ అయ్యాడు.  


చిత్రం: పక్కింటి కుర్రాడు 

కాన్సెప్ట్‌, దర్శకత్వం: చందు సాయి 

విడుదల: 12 జూలై 

వ్యూస్‌: 4.5 లక్షలు 


Updated Date - 2020-07-15T05:30:00+05:30 IST