Abn logo
Sep 19 2020 @ 10:41AM

సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ డెత్ కేసుపై సినిమా

Kaakateeya

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కన్నుమూసి చాలా రోజులే అయ్యింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేశారా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. దేశంలోని అతిపెద్ద దర్యాప్తు ఏజెన్సీలైన సీబీఐ, ఎన్సీబీ, ఈడీ రంగంలోకి దిగి, ఈ కేసును ఛేదించే ప్రయత్నం చేస్తున్నాయి. వీరి దర్యాప్తులో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఒక సినిమా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

సుశాంత్ సింగ్ రాజపూత్ సూసైడ్ కేసు ఆధారంగా రూపొందిస్తున్నఈ సినిమాకు శరళా సారాగోయీ, రాహుల్ శర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు దిలీప్ గులాటీ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సుశాంత్ పాత్రను నటుడు జుబైర్ ఖాన్ పోషిస్తున్నారు. రియాచక్రవర్తి క్యారెక్టర్‌లో శ్రేయా శుక్లా కనిపించనున్నారు. దీనికి ముందు శ్రేయ పలు వెబ్ సిరీస్‌లలో నటించారు. నటుడు శక్తీ కపూర్ సీబీఐ అధికారిగా కనిపించనున్నారు. 


Advertisement
Advertisement
Advertisement