Oct 10 2021 @ 23:37PM

మా ప్రాథమిక సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచినట్లు అధికారిక ప్రకటన వెలువడగానే నాగబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు ట్విటర్‌లో ప్రకటించారు. ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మా లో కొనసాగలేకపోతున్నానని ప్రకటించారు.