Abn logo
Sep 21 2021 @ 00:07AM

రాఘవేంద్రుడి సన్నిధిలో సినీ నటి అంజలి

నటి అంజలికి మెమెంటో ఇస్తున్న సుభుదీంద్రతీర్థులు

ఎమ్మిగనూరు(మంత్రాలయం), సెప్టెంబరు 20: మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు తెలుగు సినీనటి అంజలి సోమవారం మంత్రాలయం వచ్చారు. ముందుగా ఆమె గ్రామదేవత మంచాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూలబృందావనాన్ని దర్శించు కున్నారు. ఆమెకు మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు శేషవస్త్రం, మంత్రాక్షితలు, మెమెంటో ఇచ్చి ఆశీర్వదించారు. ఈమె వెంట మఠం అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, పీఆర్వో వ్యాసరాజ్‌, అనంతస్వామి ఉన్నారు.