మహీధర్‌ నిరసనపై కదలిక

ABN , First Publish Date - 2020-06-03T10:58:45+05:30 IST

ఒంగోలు జడ్పీ కార్యాలయంలో అ ధికార పార్టీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి సోమవారం రాత్రి ..

మహీధర్‌ నిరసనపై కదలిక

ఎమ్మెల్యేతో మాట్లాడిన బాలినేని, వైవీ

సమగ్ర విచారణకు కలెక్టర్‌ ఆదేశం


ఒంగోలు (ఆంధ్రజ్యోతి), జూన్‌ 1: ఒంగోలు జడ్పీ కార్యాలయంలో అ ధికార పార్టీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి సోమవారం రాత్రి నిరసనకు దిగడంపై అటు ప్రభుత్వ స్థాయిలోనూ ఇటు జిల్లాలో రాజకీయ, అధికార వర్గాల్లోనూ కలకలం సృష్టించింది. దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డిలు మంగళవారం ఎమ్మెల్యే మహీధర్‌తో ఆయా అంశాలపై మాట్లాడినట్లు సమాచారం. ఆర్‌డబ్ల్యూఎస్‌ పరిధిలో జిల్లాలో నిర్వహించే 52 సామూ హిక రక్షిత నీటి పథకాల నిర్వహణకు ప్రతి ఏటా సుమారు రూ.37 కోట్ల వరకు వ్యయం అవుతుంది. అయితే, గత ఏడాది టెండర్లు ఖరారు సజావుగా సాగకపోవడం, దానివల్ల పథకాల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడడంతో ఎమ్మెల్యే నిరసనకు దిగేందుకు ప్రధాన కారణంగా నిలి చింది. గతంలో టెండర్‌ పొందిన వ్యక్తి అగ్రిమెంట్‌ చేసుకొని పథకాల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేయలేదు.


పలుమార్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధి కారులు ఈ విషయమై జడ్పీ సీఈవో కైలాష్‌ గిరీశ్వర్‌ దృష్టికి తీసు కెళ్లారు. గత జనవరిలో ప్రభుత్వం నుంచి మంచినీటి పథకాల నిర్వ హణ కోసం సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. అయితే, కాం ట్రాక్టర్‌ నియామక ప్రక్రియ పూర్తి చేయకపోగా ప్రస్తుతం స్థానికంగా వాటిని నిర్వహిస్తున్న వారికి బిల్లుల చెల్లింపునకు జడ్పీ అధికారులు చర్యలు తీసుకోలేదని, ఈ మొత్తం వ్యవహరంలో జడ్పీ సీఈవో వైఖరే కారణమంటూ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి నిరసనకు దిగారు. మరోవైపు వ్యవహారం సీఎం పేషీ వరకు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. పంచాయ తీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సంబంధిత జిల్లా అధికారులతో మాట్లా డారు. ఈనేపథ్యంలో పెండింగ్‌ బిల్లుల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను గత రాత్రి పొద్దుపోయిన తర్వాత జడ్పీ సీఈవో ఇవ్వగా, బిల్లులు చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధి కారులు మంగళవారం రోజంతా చేశారు. 


త్రిసభ్య కమిటీ నియామకం 

జిల్లాలో తీవ్రస్థాయిలో ఈ వ్యవహారంపై చర్చ జరిగిన నేపథ్యంలో లోపాలు దిద్దుబాటుపై కలెక్టర్‌ భాస్కర్‌ దృష్టి సారించారు. జడ్పీ, ఆర్‌డ బ్ల్యూఎస్‌ అధికారులతో పలు అంశాలపై మాట్లాడిన ఆయన మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. జేసీ-2 చేతన్‌ నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని నియమించారు. 

Updated Date - 2020-06-03T10:58:45+05:30 IST