కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమం

ABN , First Publish Date - 2021-08-02T05:40:00+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసనగా క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన సేవ్‌ ఇండియా కార్యాక్రమాన్ని విజయ వంతం చేయాలని సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమం
కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న సీఐటీయూ నాయకులు

సిరిసిల్ల ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసనగా క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన సేవ్‌ ఇండియా కార్యాక్రమాన్ని విజయ వంతం చేయాలని సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం సిరిసిల్లలో సీఐటీయూ కార్యాలయంలో ఆగస్టు 9న నిర్వహించనున్న సేవ్‌ ఇండియా కార్యక్రమ ప్రచార కర పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముక్తికాంత అశోక్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్న వరం నర్సయ్య మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను విద్యుత్‌సవరణ చట్టాన్ని కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభు త్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను మానుకోవాలని డీజిల్‌,  పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలన్నారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.21 వేలు అమలు చేయాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించాలని, రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని అన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్నారు.  కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, రైతు సంఘం అధ్యక్షుడు అశోక్‌, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు చిలుక బాబు, మోర అజయ్‌, గణేష్‌, శ్రీధర్‌, ఎల్లయ్య పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-02T05:40:00+05:30 IST