డిమాండ్ల సాధనకు వీఆర్‌ఏల ఉద్యమం

ABN , First Publish Date - 2022-05-15T08:46:31+05:30 IST

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలుకు ఉద్యమాన్ని చేపట్టాలని గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)లు నిర్ణయించారు.

డిమాండ్ల సాధనకు వీఆర్‌ఏల ఉద్యమం

జేఏసీగా ఏర్పడిన నాలుగు వీఆర్‌ఏ సంఘాలు

హైదరాబాద్‌/రాంనగర్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలుకు ఉద్యమాన్ని చేపట్టాలని గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)లు నిర్ణయించారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రంలోని నాలుగు వీఆర్‌ఏ సంఘాలు సమావేశమై జేఏసీగా ఏర్పడ్డాయి. పేస్కేలు, అర్హత కలిగిన వారికి పదోన్నతులు, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇవ్వడంతో వాటిని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమం చేయనున్నట్లు జేఏసీ ప్రకటించింది. జేఏసీ చైౖర్మన్‌గా ఎం.రాజయ్య, కో-చైౖర్మన్‌గా రమేశ్‌ బహద్దూర్‌, సెక్రటరీ జనరల్‌గా ఎస్‌కే దాదేమియా, కన్వీనర్‌గా డి.సాయన్న, కో-కన్వీనర్‌లుగా షేక్‌ మహ్మద్‌ రఫీ, వెంకటేశ్‌ యాదవ్‌, వంగూరు రాములు, గోవింద్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

Updated Date - 2022-05-15T08:46:31+05:30 IST