కెరమెరి పోలీస్‌ స్టేషన్‌కు కాంగ్రెస్‌ నాయకుల తరలింపు

ABN , First Publish Date - 2022-08-08T04:18:02+05:30 IST

రైతుసమస్య లను పరిష్కరించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో చేపట్టిన నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేసి నాయకులను కెరమెరి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

కెరమెరి పోలీస్‌ స్టేషన్‌కు కాంగ్రెస్‌ నాయకుల తరలింపు
కెరమెరిలో రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- స్టేషన్‌లో కొనసాగిన దీక్ష.. ఆర్డీవో హామితో విరమణ

- సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం

కెరమెరి, ఆగస్టు 7: రైతుసమస్య లను పరిష్కరించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో చేపట్టిన నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేసి నాయకులను కెరమెరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ జిల్లాఅధ్యక్షుడు విశ్వ ప్రసాద్‌రావుతోపాటు కిసాన్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి కెరమెరి పోలీసు స్టేషన్‌లో దీక్షచేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీవో వారితో చర్చలు జరిపి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేవారు. అంతకుముందు కాంగ్రెస్‌ నాయకుల అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు కెరమెరి మండలకేంద్రంలోని ప్రధాన రహదా రిపై రాస్తారోకో చేపట్టి సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశాయి. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ దీక్షలకు తాత్కాలిక విరామం మాత్రమేనన్నా రు. రైతులను ఆదుకునే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. వర్షాలతో మరణించిన రైతు కుటుంబా లకు పదిలక్షల పరిహారం, వెంటనే పంటలను సర్వే చేసి పరిహారం అందించాలని డిమాండ్‌చేశారు. గణేష్‌ రాథోడ్‌, సర్పంచ్‌శేషారావు, నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ నాయకుల రాస్తారోకో

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్‌లో రెండు రోజులుగా నిరాహార దీక్షచేస్తున్న కాంగ్రెస్‌ నాయకుల అరెస్ట్‌లను నిరసిస్తూ ఆదివారం స్థానిక అంబేద్కర్‌చౌక్‌ ఎదుట కాంగ్రెస్‌ నాయకులు రాస్తారొకో చేశారు. ఈసందర్భంగా మహిళాకాంగ్రెస్‌ జిల్లా ఆధ్య క్షురాలు రాజేంద్రకుమారి, కాంగ్రెస్‌నాయకుడు మసా దేచరణ్‌ మాట్లాడుతూ అరెస్టుచేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇది టీఆర్‌ఎస్‌ పార్టీ చేసినకుట్ర అని ఆరోపించారు. రమేష్‌, దుర్గంసోమయ్య, ఆసీఫ్‌, రాపర్తి మురళీ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T04:18:02+05:30 IST