ఉద్యమమే ఊపిరి..వేడుకలే ఆసరాగా..

ABN , First Publish Date - 2022-08-13T04:34:21+05:30 IST

జాతీయ ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన మదనపల్లెలో..అప్పటి తాలూకా పరిధిలో కాంగ్రెస్‌ యాజమాన్యాల కింద 1945 అక్టోబరు 2న మహాత్మాగాంధీ 76వ జన్మదినోత్స వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఉద్యమమే ఊపిరి..వేడుకలే ఆసరాగా..
స్వాతంత్య్ర సమరయోధుడు పాపన్నగుప్తా

మదనపల్లె, ఆగస్టు 12: జాతీయ ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన మదనపల్లెలో..అప్పటి తాలూకా పరిధిలో కాంగ్రెస్‌ యాజమాన్యాల కింద 1945 అక్టోబరు 2న  మహాత్మాగాంధీ 76వ జన్మదినోత్స వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఎంవీ పాపన్నగుప్తా ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. స్వాతంత్య్ర ఉధ్యమంలో భాగంగా ప్రజలను చైతన్య పరిచే క్రమంలో బాపూజీ 1929లో మదనపల్లెకు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పటి కాంగ్రెస్‌ నేతలు, సమరయోధులు సయుక్తంగా ఈ కార్యక్రమం వేదికగా ప్రజలను చైతన్యం చేసేదిశగా ప్రయత్నించారు. ఈ సందర్భంగా స్థానిక మిషన్‌ కాంపౌండ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో స్వాతంత్య్ర సమరోత్సవంలో బాపూజీ పాత్రను ఆయన ప్రజలకు వివరించారు. తాలూకా ప్రజలే కాదు..కాంగ్రెస్‌, గాంధేయవాదులూ బాపూజీ వెంట నడవాలని, ఆయన చేపట్టిన ఖాదీ, విదేశీ వస్త్ర బహిష్కరణకు మద్దతు ఇవ్వాలని పాపన్నగుప్తా పిలుపునిచ్చారు. అలా గే వెంకటరెడ్డి, నారాయణ, రామయ్య, నూతిరాధాకృష్ణయ్య, శ్రీకాళహస్తికి చెందిన రామరత్నమ్మ, తదితరులు బాపూజీ పర్యటన, ఉద్యమాలను వివరిస్తూ భారీ ఊరేగింపు చేపట్టారు.

 

Updated Date - 2022-08-13T04:34:21+05:30 IST