హిందూ ధర్మ పరిరక్షణకు ఉద్యమం

ABN , First Publish Date - 2021-12-09T05:02:26+05:30 IST

రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల భూముల రక్షణకు ఉద్యమిస్తున్నామని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంరఽధ పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. అప్పన్న ఆలయ భూములను పరిరక్షించాలని, సర్వే నంబరు275 పోర్టు స్టేడియం వెనుక ప్రాంతంలో అనధికార నిర్మాణాలను తక్షణం నిలిపివేయాలని కోరుతూ బీజేపీ బుధవారం సింహాచలం కొండదిగువ తొలిపావంచా వద్ద చేపట్టిన నిరసనలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

హిందూ ధర్మ పరిరక్షణకు ఉద్యమం
నిరసన ప్రదర్శన చేస్తున్న బీజేపీ నేతలు

ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ 

సింహాచలం, డిసెంబరు 8: రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల భూముల రక్షణకు ఉద్యమిస్తున్నామని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంరఽధ పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. అప్పన్న ఆలయ భూములను పరిరక్షించాలని, సర్వే నంబరు275 పోర్టు స్టేడియం వెనుక ప్రాంతంలో అనధికార నిర్మాణాలను తక్షణం నిలిపివేయాలని కోరుతూ బీజేపీ బుధవారం సింహాచలం కొండదిగువ తొలిపావంచా వద్ద చేపట్టిన నిరసనలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం బడాబాబులకు అండగా నిలుస్తోందని ఆరోపించారు. ఇతర పార్టీలోంచి చ్చి అధికార పార్టీ కండువా కప్పుకున్నంత మాత్రాన అక్రమం సక్రమమవుతుందా అని అధికారులను ప్రశ్నించారు. పోర్టుస్టేడియం వెనుక  పన్నెండు ఎల్‌ఆర్‌సీలు కలిగిన వారందరకి ఒకే చోట స్థలం కేటాయింపు ఎంతవరకు సమర్ధనీయమని దేవస్థానం అధికారులను నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పన్న ఆలయ భూములపై కన్నేంసింది కాబట్టే పాలకమండలి చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజును అర్ధాంతరంగా తొలగించిందని, అదే సమయంలో అనధికార ఓఎస్‌డీలతో దేవస్థానం భూముల సమగ్ర సమాచారాన్ని సేకరించిందన్నారు. మాన్సాస్‌,  సింహాచలం, పద్మనాభం దేవస్థానం భూములను కాజేసేందుకు వైసీపీ యత్నిస్తోందని, దీనిని అడ్డుకునేందుకే సింహాద్రి అప్పన్న పాదాల నుంచి పోరాటాన్ని ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ భూములు, హిందూ ధర్మ పరిరక్షణకు రాజీలేని ఉద్యమాన్ని చేస్తామన్నారు. తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టి నిరసన ప్రదర్శన చేపట్టారు. ర్యాలీగా  ఈఓ కార్యాలయానికి  చేరుకుని, అప్పన్న భూముల అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, భూములను పరిరక్షించాలని, అన్యాక్రాంతం చేసిన వారిని, సహకరించిన దేవస్థానం ఉద్యోగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈవోకు వినతిపత్రాన్ని సమర్పించారు. దీనిపై ఈఓ సూర్యకళ మాట్లాడుతూ దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలమేరకే ప్రస్తుత వివాదానికి కారణమైన అనుమతులు ఇచ్చామన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి, అరకు పార్లమెంటు కన్వీనర్‌ పరశురామరాజు, మాఽధవీలత, ఫణీంద్ర, శ్రావణ్‌కుమార్‌, పూడిపెద్ది శర్మ, బసన అప్పలనాయుడు, జి.సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-09T05:02:26+05:30 IST