Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీపీఎస్‌ రద్దుకు ఉద్యమ శంఖారావం: ఎమ్మెల్సీ

కర్నూలు(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 5: రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లకు పీఆర్‌సీ సాధించడానికి సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యమ శంఖారావం ప్రకటించినట్లు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్‌ సుధీర్‌బాబు తెలిపారు. ఆదివారం నగరంలోని సలాంఖాన్‌ ఎస్టీయూ భవనంలో జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్‌ అధ్యక్షతన ఎస్టీయూ జిల్లా 75వ వార్షిక కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెన్షనర్లకు 41 నెలల నుంచి పీఆర్‌సీ అమలు కావడం లేదన్నారు. కరోనాతో మరణించిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని, ఉమ్మడి సర్వీసు రూల్స్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర  మాజీ అధ్యక్షుడు షణ్మూర్తి, హెచ్‌.తిమ్మన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గోకారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్‌, ప్రసాద్‌ రెడ్డి, నాగరాజు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement