ఎట్టకేలకు..

ABN , First Publish Date - 2022-07-01T05:32:19+05:30 IST

ఎట్టకేలకు కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి కదలిక వచ్చింది. పెండింగ్‌ పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం రూ.69 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో అమ్మఒడి ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం జగన్‌ నిధుల మంజూరు చేసినట్టు ప్రకటించారు.

ఎట్టకేలకు..
అసంపూర్తిగా నిలిచిన కలెక్టరేట్‌ నిర్మాణం

కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి కదలిక
రూ.69 కోట్లు మంజూరుచేసిన ప్రభుత్వం
(కలెక్టరేట్‌)

ఎట్టకేలకు కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి కదలిక వచ్చింది. పెండింగ్‌ పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం రూ.69 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో అమ్మఒడి ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం జగన్‌ నిధుల మంజూరు చేసినట్టు ప్రకటించారు. దీంతో కలెక్టరేట్‌ పెండింగ్‌ పనులు పట్టాలెక్కే అవకాశముంది. వాస్తవానికి కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం అంశం ఇప్పటిది కాదు. 2011 ఆగస్టు 8న అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు కృషి మేరకు రూ.84 కోట్లతో కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. 44 ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒకే చోట కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భావించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద కలెక్టరేట్‌ను రూపొందించాని ప్రణాళికలు రూపొందించారు. బెంగళూరుకు చెందిన కాంట్రాక్టర్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అందుకు తగ్గట్టుగానే పనులు చేశారు. కానీ సుమారు 60 శాతం పనులు చేసిన కాంట్రాక్టర్‌... అసంపూర్తిగా నిలిపివేశారు. నిధులు చాలక నిలిపివేసినట్టు చెబుతున్నారు.
- నాడు రూ.84 కోట్లతో కొత్త కలెక్టర్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఫర్నీచర్‌, రంగులు, ఇతరత్రా మౌలిక వసతులకుగాను రూ.36 కోట్లు వెరసి.. రూ.120 కోట్లు కేటాయించనున్నట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 60 శాతం వరకూ పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ పలుమార్లు కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌ దృష్టికి ఈ విషయాన్ని జిల్లా ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. దీంతో రూ.69 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం జగన్‌ ప్రకటించారు. దీంతో పనులు చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.





Updated Date - 2022-07-01T05:32:19+05:30 IST